కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేతో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర పార్లమెంటు వ్యవహారాలమంత్రి కిరణ్‌ రిజిజు ఆదవారం దిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో నూతన లోక్‌సభ తొలి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 17 Jun 2024 06:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర పార్లమెంటు వ్యవహారాలమంత్రి కిరణ్‌ రిజిజు ఆదవారం దిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో నూతన లోక్‌సభ తొలి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 10, రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయినట్లు కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలోని విలువైన పలు అనుభవాలను ఖర్గే తనకు వివరించినట్లు వెల్లడించారు. దేశం కోసం తామంతా కలసికట్టుగా పనిచేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని