హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సూచించారు.

Published : 18 Jun 2024 02:53 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సూచించారు. ఏవైనా సమస్యలుంటే కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి తెస్తే సీఎం వద్దకు తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారిలా ప్రశ్నించే గొంతులను నొక్కడం లేదని, అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపడతామని వెంకట్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అల్లర్లు సృష్టించడానికి భాజపా కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల ఆరోపించారు. తెలంగాణలో భాజపా, భారాస కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని