20న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ రాక

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్నారు.

Published : 18 Jun 2024 02:54 IST

ఘనస్వాగతం పలికేందుకు పార్టీ ఏర్పాట్లు
‘సెల్యూట్‌ తెలంగాణ’ ర్యాలీ, సభలో పాల్గొననున్న నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఘనస్వాగతం పలికి భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి భాజపా రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. ‘సెల్యూట్‌ తెలంగాణ’ పేరుతో నిర్వహించనున్న ఈ ర్యాలీలో రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది భాజపా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలోని వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులు ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారని అన్నారు. సభ అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వివరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ ఆరోపించారు. ఈ నెల 13న పెద్దపల్లిలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యమే దీనికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించి, ఇల్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని