ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నాం: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మూడు నెలలు పరిపాలన చేయగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఇటీవలే కోడ్‌ ముగిసినందున, ఇక హామీల అమలుపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.

Published : 18 Jun 2024 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మూడు నెలలు పరిపాలన చేయగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఇటీవలే కోడ్‌ ముగిసినందున, ఇక హామీల అమలుపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘భారాస ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రస్తుతం దానిని చక్కదిద్దే పనిలో ఉన్నాం. ఏపీలో పింఛన్లు పెంచారు.. మీరూ పెంచండని హరీశ్‌రావు.. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటేనే ఆయన పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. మేము తెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 పరీక్షను మేమే నిర్వహించాం. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదు. వారి హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారు. పెద్దపల్లిలో బాలికపై హత్యాచార ఘటన దురదృష్టకరం. దానిపై విచారణ జరుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని