భారాస పార్లమెంటరీ పార్టీ నేతగా సురేశ్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డిని భారాస పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎగువ సభలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు.

Published : 18 Jun 2024 03:50 IST

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖను సురేశ్‌రెడ్డికి అందజేస్తున్న కేసీఆర్‌. పక్కన ఎంపీ దామోదర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డిని భారాస పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎగువ సభలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు. ప్రస్తుతం ఆ పదవుల్లో ఉన్న కె.కేశవరావు స్థానంలో కేఆర్‌ సురేశ్‌రెడ్డిని నియమిస్తున్నట్టు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరళ్లకు కేసీఆర్‌ సోమవారం విడివిడిగా లేఖలు రాశారు. ఈ సందర్భంగా తనను కలిసిన సురేశ్‌రెడ్డిని కేసీఆర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని