వైకాపాను వీడిన మాజీ మంత్రి శిద్దా

ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైకాపాకు ప్రకాశం జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీమంత్రి, పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావు ఆ పార్టీని వీడారు.

Published : 18 Jun 2024 05:05 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైకాపాకు ప్రకాశం జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీమంత్రి, పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావు ఆ పార్టీని వీడారు. 2014-19 మధ్యకాలంలో ఆయన తెదేపా హయాంలో మంత్రిగా పనిచేశారు. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపాను వీడారు. అయినా ఆయనకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. ఇటీవలి ఎన్నికలకు ముందు శిద్దా తనయుడు సుధీర్‌బాబుకు తితిదే పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించింది వైకాపా. 2024 ఎన్నికల్లో ఆయన దర్శి అసెంబ్లీ టికెట్‌ ఆశించినా వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఒకదశలో తెదేపా ఆయనను దర్శి నుంచి బరిలోకి దించాలని యోచించినా శిద్దా ఊగిసలాట ధోరణి ప్రదర్శించారు. చివరిలో తెదేపాలో చేరేందుకు సిద్ధమైనా.. వైకాపా అధిష్ఠానం కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని బెదిరించినట్లు సమాచారం. తాను వ్యక్తిగత కారణాలరీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు సోమవారం లేఖ పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని