ఖర్గేతో షర్మిల భేటీ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. పార్టీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ ఆమె సమావేశమయ్యారు.

Updated : 19 Jun 2024 06:49 IST

మల్లికార్జున ఖర్గేతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, దిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. పార్టీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


నీట్‌ అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి: సీపీఐ

ఈనాడు, అమరావతి: వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ‘‘పరీక్షకు ఒకరోజు ముందే ప్రణాళిక ప్రకారం పేపర్‌ లీక్‌ చేయడం, అందుకు బిహార్‌కు చెందిన ముఠా 35 మంది విద్యార్థుల నుంచి రూ.30 లక్షలు చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చినట్లు తేలడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) అవకతవకలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా 1,563 మందికి ఇచ్చిన గ్రేస్‌ మార్కులను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అధికారుల అలసత్వం కారణంగా లక్షల మంది నీట్‌ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని