త్వరలో భాజపాలోకి హరీశ్‌రావు

మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలోనే భాజపాలో చేరతారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు.

Published : 19 Jun 2024 03:53 IST

బీర్ల అయిలయ్య

హైదరాబాద్, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలోనే భాజపాలో చేరతారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో మాట్లాడారు. పొర్లు దండాలు పెట్టినా భారాస పగ్గాలు హరీశ్‌రావుకు ఇవ్వరని, ఆ పార్టీని భాజపాలో విలీనం చేస్తారని అన్నారు. లేదంటే భారాసకు బతికే పరిస్థితి ఉండదన్నారు. మీడియా ముందు మాట్లాడకపోతే కేసీఆర్‌కు అనుమానం వస్తుందనే భయంతో హరీశ్‌రావు తన స్థాయికి దిగజారి ప్రభుత్వంపై అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జులై 17 నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. భాజపా ఎంపీ రఘునందన్‌రావు, హరీశ్‌రావుల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని