జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి: రాకేశ్‌రెడ్డి

జీవో 46 బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని భారాస నేత రాకేశ్‌రెడ్డి ఆక్షేపించారు.

Published : 19 Jun 2024 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీవో 46 బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని భారాస నేత రాకేశ్‌రెడ్డి ఆక్షేపించారు. స్పెషల్‌ పోలీసు నియామకాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన కాకుండా మల్టీజోనల్‌ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఆయనకు అపాయింట్‌మెంట్‌ లేదని మంగళవారం సచివాలయంలోకి అనుమతి నిరాకరించడంతో.. మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.  ‘సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం కానీ అటకెక్కింది. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, గురుకుల టీచర్లు ఆందోళన చేస్తుంటే పట్టింపు లేదు. జీవో 46 బాధితుల పక్షాన మేము సీఎస్‌ను కలవడానికి వచ్చాం. కానీ 10 రోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. అందుకే వినతిపత్రాన్ని సచివాలయ గోడకు అంటించి వచ్చాం’అని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని