ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలి

దీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న డీఏలను వెంటనే విడుదల చేయాలని భారాస నేతలు దేవీప్రసాద్, వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 19 Jun 2024 03:54 IST

భారాస నేతలు దేవీప్రసాద్, వాసుదేవరెడ్డి డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న డీఏలను వెంటనే విడుదల చేయాలని భారాస నేతలు దేవీప్రసాద్, వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వంపై హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు అన్నట్లుగా భారాస ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఆశావర్కర్లను గుర్రాలతో తొక్కించలేదు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వేరే రాష్ట్రం నుంచి నేర్చుకోవడం ఏమిటని శ్రీధర్‌బాబు అంటున్నారు. మరి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి తన సహచర మంత్రి వెళ్లడం మాత్రం ఆయనకు నచ్చుతోందా?’ అని నిలదీశారు.  ప్రభుత్వం వెంటనే ఆసరా పింఛన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని