కమీషన్ల కక్కుర్తితో అధిక ధరకు విద్యుత్‌ కొన్నారు

విద్యుత్‌శాఖలో జరిగిన అవినీతి మాజీ సీఎం కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటోందని, కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేశారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 19 Jun 2024 03:55 IST

కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపణ

హైదరాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్‌శాఖలో జరిగిన అవినీతి మాజీ సీఎం కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటోందని, కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేశారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీతో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటును నిర్మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20 కోట్లకు మించి ఖర్చయ్యేది కాదు. అప్పుడు యాదాద్రి పవర్‌ ప్లాంటు అవసరమే ఉండకపోయేది. యాదాద్రి ప్లాంటు ప్రభుత్వానికి భారమవుతుందని అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ చెప్పినా కేసీఆర్‌ సర్కారు వినలేదు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణలో కేసీఆర్‌ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హరీశ్‌రావు నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ అంశం లేవనెత్తుతున్నారు’ అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు