జగన్‌ అరాచక పాలనలో పోలవరం అధోగతి: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

ఐదేళ్ల జగన్‌ అరాచక పాలనలో పోలవరం అధోగతి పాలైందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పోలవరం పనులు ఇక పరుగులు పెడతాయన్నారు.

Published : 19 Jun 2024 06:05 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఐదేళ్ల జగన్‌ అరాచక పాలనలో పోలవరం అధోగతి పాలైందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పోలవరం పనులు ఇక పరుగులు పెడతాయన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘తెదేపా హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి. నిర్మాణంలో భాగంగా ఒక్క రోజులో 35 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో యథేచ్ఛగా కమీషన్లు దండుకున్నారు. రానున్న రోజుల్లో పోలవరం పూర్తి చేసేది, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదీ ముఖ్యమంత్రి చంద్రబాబే’ అని అనురాధ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని