విద్యుత్‌ కమిషన్‌ మీద కేసీఆర్‌ ఎదురుదాడి సరికాదు

విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ వివరణ కోరితే ఇవ్వకుండా కమిషన్‌ మీద మాజీ సీఎం కేసీఆర్‌ ఎదురుదాడి చేయడం సమంజసం కాదని కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ జాతీయ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు పేర్కొన్నారు.

Published : 19 Jun 2024 06:05 IST

కాంగ్రెస్‌ నేతలు దామోదర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి 

హైదరాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ వివరణ కోరితే ఇవ్వకుండా కమిషన్‌ మీద మాజీ సీఎం కేసీఆర్‌ ఎదురుదాడి చేయడం సమంజసం కాదని కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ జాతీయ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు పేర్కొన్నారు. వారు మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసు ఇవ్వలేదు..వివరణ ఇవ్వాలని మాత్రమే అడిగిందన్నారు. అసెంబ్లీలో విద్యుత్‌ శాఖ మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి కోరితేనే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ వేసిందని, నిర్మాణంలో ఉన్న మార్వా పవర్‌ ప్లాంట్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ తన తరఫున జగదీశ్‌రెడ్డిని గానీ, మరెవరినైనా పంపితే విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని వారు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు