రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 20 Jun 2024 04:25 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్‌ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున బాలాపూర్‌లో సమీర్‌ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్యాఘటన మరవకముందే, మరో దారుణం చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీసే మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసిన ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. జూనియర్‌ కళాశాలల్లో వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్‌ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యువల్‌  చేయాలి’’ అని హరీశ్‌రావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని