విద్యుత్‌ కమిషన్‌కు కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: కోదండరెడ్డి

భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి విద్యుత్‌ కమిషన్‌ అడిగిన ప్రతి ప్రశ్నకు మాజీ సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.

Published : 20 Jun 2024 04:39 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి విద్యుత్‌ కమిషన్‌ అడిగిన ప్రతి ప్రశ్నకు మాజీ సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి ఎండాకాలం పంట 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, కేవలం మూడు రోజుల్లోనే అందుకు సంబంధించిన సొమ్ము మొత్తం రూ.10,352 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఈ విషయంలో రైతుల     తరఫున కిసాన్‌ కాంగ్రెస్‌ పక్షాన సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు  కోదండరెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని