గురుకుల విద్యను నిర్వీర్యం చేస్తున్న రేవంత్‌ సర్కార్‌

గురుకుల విద్యను అధ్యయనం పేరుతో నిర్వీర్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు.

Updated : 20 Jun 2024 04:45 IST

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల విద్యను అధ్యయనం పేరుతో నిర్వీర్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హయాంలో గురుకుల విద్యను పటిష్ఠం చేశారని.. ఇప్పుడు రేవంత్‌ గురుకుల విద్యను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే గురుకుల విద్యను నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ..గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణపై అవగాహన లేనిది ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికేనని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని