అన్నదాతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

అన్నదాతలపట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నిర్మల్‌ ఎమ్మెల్యే, భాజపా శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌లో పెట్టుబడికి రైతులు ఎదురుచూస్తున్నారన్నారు.

Published : 20 Jun 2024 04:46 IST

భాజపా శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అన్నదాతలపట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నిర్మల్‌ ఎమ్మెల్యే, భాజపా శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌లో పెట్టుబడికి రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. రైతు బిడ్డ అని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతలకు భరోసా కల్పించడంపై దాటవేత ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని