రాజకీయాల్లోకి నీతీశ్‌ తనయుడు?

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తనయుడు నిశాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు నీతీశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Published : 20 Jun 2024 05:31 IST

బిహార్‌లో భారీ ఎత్తున ఊహాగానాలు
కొట్టిపారేసిన మంత్రి

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తనయుడు నిశాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు నీతీశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలను బిహార్‌ మంత్రి విజయ్‌ కుమార్‌ చౌధరి కొట్టిపారేశారు. అదే సమయంలో నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే మంచిదని రాష్ట్ర ఆహార కమిషన్‌ చీఫ్‌ పేర్కొనడం గమనార్హం. నీతీశ్‌ కుమారుడు నిశాంత్‌ అరుదైన సందర్భాల్లోనే తన తండ్రితో కలిసి బహిరంగంగా కనిపిస్తారు. అలాంటిది ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఊపందుకోవడం సంచలనమైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిహార్‌కు యువ నాయకత్వం అవసరమని జేడీయూ నేత, రాష్ట్ర ఆహార కమిషన్‌ చీఫ్‌ విద్యానంద్‌ వికల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిశాంత్‌ కుమార్‌లో రాజకీయాలకు కావాల్సిన లక్షణాలున్నాయని పేర్కొన్నారు. చాలా మంది జేడీయూ నేతలు నిశాంత్‌ రాజకీయాల్లోకి రావాలని వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తాను పంచుకుంటున్నానని వెల్లడించారు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఊహాగానాలను జేడీయూ మంత్రి విజయ్‌ కుమార్‌ చౌధరి ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ‘సున్నితమైన ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవద్దని పార్టీ నాయకులను కోరుతున్నా. నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇటువంటి ఊహాగానాలు ప్రజల మనసులో సందేహాలను కలిగిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని