ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లు

ముఖ్యమంత్రిగా జగన్‌ దిగిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరినట్లు భాజపా ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు.

Updated : 20 Jun 2024 06:49 IST

లంకా దినకర్‌

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రిగా జగన్‌ దిగిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరినట్లు భాజపా ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ ఏపీభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రస్తుతం బడ్జెట్‌ రుణాలు రూ.5.50 లక్షల కోట్లు ఉన్నాయని..బడ్జెటేతర రుణాలు రూ.7.50 లక్షల కోట్లని చెప్పారు. ఇందులో బడ్జెట్‌ రుణాలకు రోజుకు రూ.100 కోట్లు, బడ్జెటేతర రుణాలకు రోజుకు రూ.150 కోట్లు కలిపి నిత్యం రూ.250 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అంటే సంవత్సరానికి అప్పులపై వడ్డీ కిందే రూ.90 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. జగన్‌ ప్రభుత్వం పారదర్శకత లేకుండా చేసిన రుణాలు, ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు. 

జగన్‌ తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు: రమేష్‌నాయుడు

2019 ఎన్నికల్లో విజయం తన గొప్పతనమే అని చెప్పుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాజా పరాజయాన్ని ఈవీఎంలపైకి తోసేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని భాజపా ఏపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని