కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్‌ ప్రమాణం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్‌(కాంగ్రెస్‌) ప్రమాణం చేశారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Published : 21 Jun 2024 05:12 IST

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీగణేశ్‌. చిత్రంలో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్‌(కాంగ్రెస్‌) ప్రమాణం చేశారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యలు తదితరులు పాల్గొన్నారు. శ్రీగణేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఆయన గెలుపొందిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని