ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్‌ నిర్ణయిస్తుంది

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరిని నియమించాలనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయిస్తుందని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ గురువారం తెలిపారు.

Published : 21 Jun 2024 05:51 IST

ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వెల్లడి

పుణె: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరిని నియమించాలనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయిస్తుందని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ గురువారం తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడికి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించగా ఈ నిబంధనను మోదీ గతంలోనూ పాటించలేదని పేర్కొన్నారు. ‘‘ఈ విషయమై చర్చ జరగొచ్చు. అయితే దానివల్ల ఎలాంటి సానుకూల ఫలితం ఉంటుందని నేను భావించట్లేదు’’ అని తెలిపారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతిలో గురువారం శరద్‌పవార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘అత్యధిక సీట్లు దక్కించుకున్న ఇండియా కూటమి పార్టీకి చెందిన నేతకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా దక్కేలా గతంలో మా మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం 99 సీట్లతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఆ హోదాలో ఉంటారనేది ఆ పార్టీయే నిర్ణయిస్తుంది’’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని