2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్‌.కృష్ణయ్య

అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 21 Jun 2024 05:53 IST

ధర్నాలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. చిత్రంలో నీల వెంకటేశ్‌ తదితరులు

రాంనగర్, న్యూస్‌టుడే: అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గురువారం నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులను పెంచాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రూప్‌-1 పోస్టులు 1,600 ఉంటే 503 ప్రకటించారని, గ్రూప్‌-2 సర్వీస్‌ కింద 2,200ల పోస్టులకు 783, గ్రూప్‌-3లో 3వేలకు పైగా ఉంటే 1,383, గ్రూప్‌-4లో 25 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 8,500 మాత్రమే ప్రకటించారని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక ప్రకారం 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మండలాలు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీస్‌ కమిషనరేట్లు, గ్రామపంచాయతీల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ ఐకాస సభ్యులు అశోక్, అన్వర్, అంజి, అనంతయ్య, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని