జగన్‌ పాలనలో అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం

ఐదేళ్ల జగన్‌ పాలనలో వివిధ రంగాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని భాజపాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

Updated : 22 Jun 2024 05:00 IST

భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ 

ఈనాడు, అమరావతి: ఐదేళ్ల జగన్‌ పాలనలో వివిధ రంగాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని భాజపాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. శాసనసభకు వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసిన సందర్భంగా.. ఐదేళ్ల జగన్‌ పాలనలో ఇసుక, మద్యం, విద్యుత్‌ రంగాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా వినతిపత్రాలు అందజేశామన్నారు. విద్యుత్‌ రంగంలో స్మార్ట్‌మీటర్లు, పీపీఏలు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల కేటాయింపు వంటి అంశాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని