అనంతపురంలో వాసుదేవరెడ్డి అక్రమాలు

ధర్మవరం, తాడిపత్రి, అనంతపురం పట్టణాల్లోని వాక్‌ఇన్‌ లిక్కర్‌ దుకాణాల్లో జరిగిన అక్రమాల్లో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పాత్రపై గతంలో చేసిన దర్యాప్తు రిపోర్టును పరిగణనలోకి తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు.

Published : 22 Jun 2024 04:11 IST

గతంలోని దర్యాప్తు రిపోర్టును పరిగణనలోకి తీసుకోండి
సీఐడీ అధికారులకు వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్, అమరావతి: ధర్మవరం, తాడిపత్రి, అనంతపురం పట్టణాల్లోని వాక్‌ఇన్‌ లిక్కర్‌ దుకాణాల్లో జరిగిన అక్రమాల్లో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పాత్రపై గతంలో చేసిన దర్యాప్తు రిపోర్టును పరిగణనలోకి తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు వాసుదేవరెడ్డి అక్రమాలపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘అనంతపురం జిల్లాలో జరిగిన మద్యం అక్రమాలపై అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫిర్యాదుతో గత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అనంతపురం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి మునిరామయ్యను విచారణాధికారిగా నియమించారు. దర్యాప్తులో వాసుదేవరెడ్డి అక్రమాల్ని ఆయన నిగ్గుతేల్చారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో మునిరామయ్యపై అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి కక్షగట్టారు. అవినీతి అధికారుల్ని శిక్షించాల్సింది పోయి.. విచారణ చేసిన పాపానికి మునిరామయ్యను వీఆర్‌కు పంపారు. ఫిబ్రవరి నుంచి జీతభత్యాలు లేకుండా ఆయన ఇబ్బందిపడుతున్నారు’’ అని వర్ల రామయ్య అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని