తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు

తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశంలో చంద్రబాబు ప్రకటించే అవకాశముంది.

Published : 22 Jun 2024 04:12 IST

ఈనాడు, అమరావతి: తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశంలో చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. ఈసారి లోక్‌సభలో తెదేపాకు 16 మంది ఎంపీలున్నారు. ఈ నెల 24 నుంచి మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో సహకారం పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపై దిశా నిర్దేశం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని