నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: షర్మిల

నీట్‌ పేపర్‌ లీక్‌ కావడంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ‘నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై’ విజయవాడ ధర్నాచౌక్‌లో శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

Published : 22 Jun 2024 04:12 IST

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న షర్మిల, మయప్పన్, కిల్లి కృపారాణి తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: నీట్‌ పేపర్‌ లీక్‌ కావడంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ‘నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై’ విజయవాడ ధర్నాచౌక్‌లో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా, జనసేన, వైకాపా.. భాజపా తొత్తు పార్టీలు కావడంతోనే ఈ అంశంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, జగన్‌ మాట్లాడటం లేదని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ, ఏఐసీసీ కమిటీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌లో అన్ని కమిటీలూ రద్దు: షర్మిల

ఈనాడు, అమరావతి: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌లోని అన్ని కమిటీలనూ పూర్తిగా రద్దు చేసినట్లు షర్మిల తెలిపారు. పార్టీ బలోపేతానికి త్వరలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని