భాజపా రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అందరితో చర్చించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

రాష్ట్రంలో తదుపరి రాబోయేది భాజపా ప్రభుత్వమేనని, ఈ నేపథ్యంలో పార్టీకి నూతన అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించారు.

Published : 22 Jun 2024 04:42 IST

గోషామహల్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తదుపరి రాబోయేది భాజపా ప్రభుత్వమేనని, ఈ నేపథ్యంలో పార్టీకి నూతన అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. ‘తెలంగాణ భాజపాకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని వింటున్నాం. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ సీనియర్‌ నేతలందరితో చర్చించి అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఎందరో ఉన్నారు. వారందరితో చర్చించాలి‘ అని రాజాసింగ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు