కాంగ్రెస్‌ విధానాలు నచ్చే పార్టీలోకి భారాస ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌ విధానాలు నచ్చి భారాస ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 04:47 IST

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ విధానాలు నచ్చి భారాస ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో భారాసకు కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను సంఖ్యాబలం కోసం చేర్చుకున్నారని.. ఇప్పుడు తాము కూడా కావాల్సిన మెజార్టీ ఉన్నా సంఖ్యాబలం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కార్పొరేషన్‌ పదవులకు జీవోలు వస్తాయని తెలిపారు. 

పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి దగ్గర భారాస నేతల ఆందోళన అర్థరహితమని కాంగ్రెస్‌ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి భారాసలో నరకం చూశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని