స్వార్థంతోనే పోచారం నిర్ణయం

వ్యక్తిగత స్వార్థం కోసమే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని భారాస నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు.

Published : 22 Jun 2024 04:48 IST

మాజీ మంత్రులు, భారాస నేతల విమర్శలు 

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తిగత స్వార్థం కోసమే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని భారాస నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో గోవర్ధన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనే. వృద్ధాప్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఏం సాధిస్తారు? ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. నేనే భారాస నుంచి బరిలోకి దిగుతా’’ అని బాజిరెడ్డి సవాల్‌ విసిరారు.

పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి పెద్దమనిషి పార్టీ మారడం గర్హనీయమని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఏ నైతికతతో పోచారం పార్టీ మారుతున్నారో అర్థం కావడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోచారం ఇలా చేయడం బాధాకమరమని పేర్కొన్నారు. - కేసీఆర్‌ ఏం తక్కువ చేశారని పోచారం పార్టీ వీడారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ‘గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నా నియోజకవర్గం కంటే బాన్సువాడకే కేసీఆర్‌ ఎక్కువ రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశారు’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని