‘ప్రభుత్వ వ్యతిరేక గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం కుట్ర’

తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేక గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం యోచిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని తెజస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ఆరోపించారు.

Updated : 22 Jun 2024 05:46 IST

షాద్‌నగర్, న్యూస్‌టుడే: తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేక గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం యోచిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని తెజస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన ఆచార్య జయశంకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బొగ్గుగనుల వేలం ద్వారా బడా వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందే కానీ రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి పాలమూరును మినహాయించాలని ఎంపీ డీకే అరుణ చెప్పడం దారుణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని