దివ్యాంగులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నమ్మకద్రోహం

‘రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులకు నమ్మక ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు’ అని ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 22 Jun 2024 04:56 IST

పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలి
25న కార్యాచరణ ప్రకటిస్తాం: మంద కృష్ణమాదిగ

సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ 

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులకు నమ్మక ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు’ అని ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధాక భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్‌ నుంచి పింఛన్ల బకాయిలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 2018లో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. డిసెంబరు నుంచి పెంచిన పింఛన్ల బకాయిలను చెల్లించాలని, లేనిపక్షంలో రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు పెన్షనర్లకు ప్రభుత్వం రూ.6,223 కోట్లు బకాయి పడిందన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో దివ్యాంగుల సంఘాలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాగే రాజకీయ పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్‌ కమిటీ ఛైర్మన్‌ ఎల్‌.గోపాల్‌రావు, కో-ఛైర్మన్‌ అందె రాంబాబు, జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశీ, జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి, రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని