ఐటీఐఆర్‌ను వెంటనే మంజూరు చేయాలి: జగ్గారెడ్డి

తెలంగాణకు ఐటీఐఆర్‌ను తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 22 Jun 2024 05:33 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణకు ఐటీఐఆర్‌ను తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఐటీఐఆర్‌ మంజూరు చేస్తే ఎన్డీయే ప్రభ్వుతం రద్దు చేసిందన్నారు. కిషన్‌రెడ్డి, సంజయ్‌లు రద్దు కాకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ఐటీఐఆర్‌ రద్దుతో 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయన్నారు. పార్టీలోకి చేరికల అంశం తన పరిధి కాదని, సీఎం చూసుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని