బెంగాల్‌ పీసీసీ అద్యక్ష పదవికి అధీర్‌ రంజన్‌ రాజీనామా

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పలు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. పశ్చిమబెంగాల్‌లో మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూసింది.

Published : 22 Jun 2024 05:34 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పలు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. పశ్చిమబెంగాల్‌లో మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ క్రమంలో బెంగాల్‌ పీసీసీ అధ్యక్ష పదవికి అధీర్‌ రంజన్‌ ఛౌదరి రాజీనామా చేశారు. పార్టీ పేలవమైన పనితీరుకు గల కారణాలపై పీసీసీ సమావేశంలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధీర్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ఆమోదంపై పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. బహరంపుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన తృణమూల్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో ఓడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని