రాజ్యసభాపక్ష నేతగా నడ్డా?

కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Published : 22 Jun 2024 05:34 IST

దిల్లీ: కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో.. ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబరు-జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా.. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నడ్డా.. జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన కేంద్ర మంత్రి వర్గంలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని