నీట్‌లో అవకతవకలపై నిరసన

నీట్‌ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ.. హైదరాబాద్‌ బర్కత్‌పురలోని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి శనివారం విద్యార్థి, యువజన సంఘాల నేతలు ప్రయత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 23 Jun 2024 04:18 IST

కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సహా పలువురి అరెస్టు

కిషన్‌రెడ్డి నివాసానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి, యువజన సంఘాల నేతలు

బర్కత్‌పుర, నల్లకుంట, న్యూస్‌టుడే: నీట్‌ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ.. హైదరాబాద్‌ బర్కత్‌పురలోని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి శనివారం విద్యార్థి, యువజన సంఘాల నేతలు ప్రయత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వీజేఎస్, వైజేఎస్‌ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ (ఎన్‌ఎస్‌యూఐ) సహా సుమారు 50 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట ఠాణాకు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వారందరినీ విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని