‘రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం’

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్‌ సర్కారు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Published : 23 Jun 2024 04:19 IST

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్‌ సర్కారు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అన్నదాతలకు సకాలంలో రైతుబంధును అందించడంలో రేవంత్‌ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఉపసంఘం వేసి జులై 15 వరకు డెడ్‌లైన్‌ పెట్టిందని, సీజన్‌ పూర్తయ్యాక రైతుభరోసా అందజేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే నకిలీ విత్తనాల దందా వెలుగులోకి రావడం దురదృష్టకరమన్నారు.

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎర్రబెల్లి

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ఖండించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని