భారాస తీరు దొంగే దొంగ అన్నట్లుంది: భట్టి

‘‘బొగ్గు గనుల వేలాన్ని ఆపామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలోని బొగ్గు గనుల వేలానికి అనుమతిచ్చేందుకు వీలుగా కేంద్రం తీసుకొచ్చిన ఎంఎండీఆర్‌ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలికి ఓట్లేసింది ఆ పార్టీనే.

Published : 23 Jun 2024 04:21 IST

ఈనాడు, దిల్లీ: ‘‘బొగ్గు గనుల వేలాన్ని ఆపామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలోని బొగ్గు గనుల వేలానికి అనుమతిచ్చేందుకు వీలుగా కేంద్రం తీసుకొచ్చిన ఎంఎండీఆర్‌ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలికి ఓట్లేసింది ఆ పార్టీనే. ఈ చరిత్రను ఎవ్వరూ మార్చలేరు’’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం సాయంత్రం ఇక్కడి తెలంగాణ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘పదేళ్లలో తెలంగాణలో రెండు బొగ్గు గనులను వేలం వేస్తే ఆ రెండూ సింగరేణికి కాకుండా వారికి అనుకూలమైన ప్రైవేటు సంస్థలకు దక్కేలా చేసింది భారాస నేతలే. భారాస అధికారంలో ఉన్నప్పుడు బొగ్గుగనుల వేలాన్ని ఆపామని చెబుతున్న కేటీఆర్‌ మరి ఆ రెండు గనులు ప్రైవేటు వారికి ఎలా వెళ్లాయో సమాధానం ఇవ్వాలి. బొగ్గు గనులు దక్కించుకున్న అవంతిక సంస్థ వెనుక ఎవరున్నారో దర్యాప్తు జరిపితే తెలుస్తుంది. సింగరేణికి నష్టం కలిగించింది ఆ పార్టీ నాయకులే. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ దొంగే దొంగ అని అరిచినట్లుగా అది వ్యవహరిస్తోంది’’ అని భట్టి ధ్వజమెత్తారు.

 భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై అడిగిన ప్రశ్నకు... ‘‘రాష్ట్రంలో భారాస లేదు. అందులో ఉన్న నాయకులంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు’’ అని బదులిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని