కేసీఆర్‌ భాజపాలోకి వస్తానంటే స్వాగతిస్తాం: రఘునందన్‌రావు

భాజపా సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తానంటే కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు రఘునందన్‌రావు అన్నారు.

Published : 23 Jun 2024 04:22 IST

కురుమ రిజర్వేషన్‌ సమితి ప్రతినిధులు బహూకరించిన గొంగడితో రఘునందన్‌రావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: భాజపా సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తానంటే కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు రఘునందన్‌రావు అన్నారు. అమీర్‌పేటలోని ఆదిత్యా పార్క్‌ ఇన్‌ హోటల్‌లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ‘రఘునందన్‌రావుతో మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రఘునందన్‌రావు స్పందిస్తూ భాజపా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేస్తామని వస్తే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవరినైనా పార్టీలో చేర్చుకుంటామన్నారు. అంతకుముందు కురుమ రిజర్వేషన్‌ సమితి ప్రతినిధులు 2022లో విశిష్ఠ చేనేత ఉత్పత్తిగా యునెస్కో గుర్తింపు పొందిన గొంగడిని రఘునందన్‌రావుకు బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని