అసెంబ్లీ సీట్ల పంపకంలో తక్కువ సీట్లతో సరిపెట్టుకోం

లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీయే) మిత్రపక్షాల కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించిందని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.

Published : 23 Jun 2024 04:35 IST

పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన శరద్‌ పవార్‌

పుణె: లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీయే) మిత్రపక్షాల కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించిందని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. శుక్రవారం పుణెలో ఆ జిల్లా కార్యకర్తలతో, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలతో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో పవార్‌ పాల్గొన్నారు. మొదటి సమావేశానికి హాజరైన నగర ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ ప్రశాంత్‌ జగ్తాఫ్‌ మాట్లాడుతూ.. ‘‘శివసేన(యూబీటీ), కాంగ్రెస్‌లతో పొత్తు విడిపోకుండా ఉండేందుకు లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసినట్లు శరద్‌ పవార్‌ సమావేశంలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు’’ అని తెలిపారు. పుణె, బారామతి, మావల్, షిరూర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితిని శరద్‌పవార్‌ సమీక్షించారని ప్రశాంత్‌ పేర్కొన్నారు. రెండో సమావేశానికి హాజరైన ఓ నేత మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు పవార్‌ దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఎంవీయే సీట్ల పంపకంపై పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు