వయనాడ్‌లో ప్రియాంక ప్రచారానికి దీదీ!

కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికలో ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Published : 23 Jun 2024 04:36 IST

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికలో ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో పోటీ చేసి రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఇప్పటివరకు ఏ స్థానంలోనూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మారిన వయనాడ్‌లో ఆమె తొలిసారి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని