‘ఆడుదాం ఆంధ్రా’లో అవినీతిపై చర్చకు సిద్ధమా?

‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల నిర్వహణలో జరిగిన రూ.100 కోట్ల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు రాష్ట్ర ఆత్యా-పాత్యా క్రీడా సంఘం సీఈవో ఆర్‌డీ ప్రసాద్‌ సవాల్‌ విసిరారు.

Updated : 23 Jun 2024 06:47 IST

మాజీ మంత్రి రోజా, బైరెడ్డిలకు ఆత్యా-పాత్యా క్రీడా సంఘం సీఈవో ప్రసాద్‌ సవాల్‌

ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌ బ్రోచర్‌ చూపుతున్న ప్రసాద్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల నిర్వహణలో జరిగిన రూ.100 కోట్ల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు రాష్ట్ర ఆత్యా-పాత్యా క్రీడా సంఘం సీఈవో ఆర్‌డీ ప్రసాద్‌ సవాల్‌ విసిరారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తే రూ.100 కోట్ల అవినీతి ఎలా జరిగిందో తెలియడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ పోటీలకు గత వైకాపా ప్రభుత్వం విడతల వారీగా రూ.130 కోట్లు విడుదల చేసినట్లుగా మా వద్ద సమాచారం ఉంది. దీనికి సంబంధించి 26 జిల్లాల్లోని క్రీడాధికారులు, శాప్‌ కార్యాలయంలోని కీలక అధికారులపై కూడా విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డిలను కోరుతున్నాం. 

వైకాపా ప్రభుత్వ పాలనలో మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు ట్రిపుల్‌ ఐటీల్లోని క్రీడా కోటా ప్రవేశాల్లో భారీ అవినీతి జరిగింది. దీనిపై సీఐడీ విచారణ చేపట్టాలని గతంలోనే ఫిర్యాదు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మోడరన్‌ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తల అప్పలస్వామి, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య, ఎన్టీఆర్‌ జిల్లా టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి వెంకటేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని