తూర్పుగోదావరి వైకాపా కార్యాలయానికి నోటీసులు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారులు శనివారం నోటీసులు అతికించారు.

Published : 23 Jun 2024 05:34 IST

భవనం వద్ద నోటీసు అతికిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారులు శనివారం నోటీసులు అతికించారు. భవన నిర్మాణానికి అనుమతుల్లేవని, ఆధారాలుంటే వారంలోగా చూపించాలని అందులో పేర్కొన్నారు. గడువులోగా స్పందన తెలియజేయాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైకాపా జిల్లా అధ్యక్షుడికి నోటీసు ఇచ్చారు. ప్రాథమిక విచారణలో దీన్ని అనధికార నిర్మాణంగా గుర్తించారు. దీంతో నోటీసు జారీచేసినట్లు ప్రణాళికా విభాగం అధికారులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. 

అనంతపురంలోనూ తాఖీదులు..

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: అనంతపురం నగరం హెచ్‌ఎల్‌సీ కాలనీలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో అక్రమంగా వైకాపా కార్యాలయం నిర్మాణంపై నగరపాలక సంస్థ ఆలస్యంగా మేల్కొంది. గత ప్రభుత్వ హయాంలోనే తాఖీదులు ఇవ్వాలని దస్త్రం సిద్ధం చేసినా అధికారపార్టీకి భయపడి వెనుకంజ వేశారు. అనుమతులు, ప్లాన్‌ లేకుండా వైకాపా కార్యాలయం నిర్మాణం చేపట్టారని.. దీనిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ శనివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యకు తాఖీదులు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు