జడ్పీ ఛైర్మన్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి పొన్నం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ ప్రసంగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది.

Published : 24 Jun 2024 04:04 IST

మాట్లాడుతుండగా మైకు లాక్కున్న వైనం

సుధీర్‌కుమార్‌ నుంచి మైకు లాక్కుంటున్న మంత్రి పొన్నం 

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ ప్రసంగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ గ్రామంలో స్థానిక నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆ తరువాత వచ్చిన జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత భారాస ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, ఇప్పుడు మరిన్ని ఎస్సీ గురుకులాలు ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం దళిత బంధు కింద కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చిందని, కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన మేరకు దళిత, గిరిజనులకు రూ.12 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని కోరారు. ఈ దశలో మంత్రి పొన్నం అడ్డుకుని.. ఆయన నుంచి మైక్‌ లాక్కున్నారు. ఇది రాజకీయ సభ కాదని, రాజకీయాలు మాట్లాడవద్దన్నారు. సుధీర్‌కుమార్‌ నిర్వాహకుల నుంచి మళ్లీ మైక్‌ తీసుకుని మాట్లాడబోగా.. కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకుని, జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. ఆయనను పోలీసులు వేదిక నుంచి కిందకు తీసుకెళ్లాక గొడవ సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని