శ్యామాప్రసాద్‌ ముఖర్జీకి భాజపా నేతల నివాళి

జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ సందర్భంగా ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు నివాళులర్పించారు.

Published : 24 Jun 2024 04:08 IST

భాజపా రాష్ట్ర కార్యాలయంలో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ సందర్భంగా ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు నివాళులర్పించారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు శ్యామాప్రసాద్‌ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు