ప్రభుత్వ స్థలాల్లో ప్యాలెస్‌లు కట్టుకోవడమా?

ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పార్టీ కార్యాలయాల పేరుతో ప్యాలెస్‌లు కట్టుకోవడం దారుణమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. జగన్‌ ధనదాహానికి, ప్యాలెస్‌ల పిచ్చికి అంతే లేనట్టుగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

Updated : 24 Jun 2024 06:36 IST

గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పార్టీ కార్యాలయాల పేరుతో ప్యాలెస్‌లు కట్టుకోవడం దారుణమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. జగన్‌ ధనదాహానికి, ప్యాలెస్‌ల పిచ్చికి అంతే లేనట్టుగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ‘అక్రమ కట్టడాలుంటే కూలదోయాలని ఆనాడు చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు లబోదిబోమంటున్నారు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ఏ భవనాన్నైనా ప్రభుత్వం తొలగిస్తుంది. దోచుకున్న రూ. 500 కోట్లతో ప్రభుత్వ స్థలాల్లో ప్యాలెస్‌లు కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?’ అని ప్రశ్నించారు.

రేపు జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ

శాసనసభ వ్యవహారాలు, నియమ నిబంధనలపై జనసేన తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని