‘నీట్‌’ విద్యార్థులకు న్యాయం చేయాలి

‘నీట్‌’ పరీక్ష అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 25 Jun 2024 05:06 IST

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు
భాజపా కార్యాలయం ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: ‘నీట్‌’ పరీక్ష అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆమె అధ్యక్షతన మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ‘నీట్‌’ లీకేజీకి నిరసనగా భాజపా కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. ప్రధాని మోదీ డౌన్‌డౌన్, 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు గాంధీభవన్‌ గేట్లకు అడ్డంగా బారికేడ్స్‌ పెట్టి వారిని అడ్డుకున్నారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. మళ్లీ ‘నీట్‌’ పరీక్షలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని..  కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చొరవ తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని