నీట్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టాలి

గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్న భాజపా ఎంపీ రఘునందన్‌కు నీట్‌ అక్రమాలపై ఈడీ దర్యాప్తు అక్కర్లేదా? అని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 25 Jun 2024 05:06 IST

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్న భాజపా ఎంపీ రఘునందన్‌కు నీట్‌ అక్రమాలపై ఈడీ దర్యాప్తు అక్కర్లేదా? అని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. చిన్న కేసులకు కూడా ఈడీని పంపే మోదీ.. మరి నీట్‌ అవకతవకలపై ఎందుకు రంగంలోకి దింపలేదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్‌ అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం వినోద్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘చివరి నిమిషంలో నీట్‌ పీజీ పరీక్షను రద్దు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. నీట్‌ యూజీలో అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పుడే... పీజీ ప్రవేశ పరీక్షను రద్దు చేయాల్సింది. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. నీట్‌ నుంచి రాష్ట్రం బయటకు వచ్చే విధంగా సీఎం రేవంత్‌ సుప్రీంకోర్టులో మంచి న్యాయవాదిని నియమించాలి’’ అని వినోద్‌కుమార్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని