సంజయ్‌కుమార్‌ పదవికి రాజీనామా చేయాలి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారాస శ్రేణులు నిరసన చేపట్టాయి.

Published : 25 Jun 2024 05:08 IST

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భారాస శ్రేణులు

ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించిన భారాస నాయకులు

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారాస శ్రేణులు నిరసన చేపట్టాయి. జగిత్యాలలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భారాస జగిత్యాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నివాసాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించి వేశారు. తహసీల్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ సంజయ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జడ్పీ వైస్‌ఛైర్మన్‌ హరిచరణ్‌ రావు, జడ్పీటీసీ సభ్యుడు భూమయ్య, రాయికల్‌ పురపాలక ఛైర్మన్‌ హన్మాండ్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని