వాస్తవాల కోసమే రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘం

వాస్తవాల కోసమే రైతు రుణమాఫీపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసిందని, లబ్ధిదారులను తగ్గించడం కోసం కాదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు.

Published : 25 Jun 2024 05:10 IST

కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిల
చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాదిగ దండోరా సంఘాల ప్రతినిధులు.

హైదరాబాద్, న్యూస్‌టుడే: వాస్తవాల కోసమే రైతు రుణమాఫీపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసిందని, లబ్ధిదారులను తగ్గించడం కోసం కాదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారని.. సీఎం అంటే కటింగ్‌ మాస్టరా? అంటూ కేటీఆర్‌ విమర్శలు చేయడం సరికాదన్నారు. ధరణి పోర్టల్‌లో మంత్రిగా కేటీఆర్‌ నిర్వాకంతో 18 లక్షల ఎకరాల భూమి పార్ట్‌-బీలో పెట్టారని, దాంతో లక్షల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ధరణిని అడ్డంపెట్టుకొని నల్గొండ జిల్లాలో వందల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. వీహెచ్‌ మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటానికి క్షీరాభిషేకం..

రైతులకు రూ.2లక్షల రుణమాఫీకి క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ మాదిగ దండోరా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌ నేత సతీశ్‌ మాదిగ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిల చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం చేశారు. డప్పుకొట్టి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దండోరా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని