రాజ్యసభాపక్ష నేతగా నడ్డా

రాజ్యసభాపక్ష నేతగా భాజపా అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న పీయూష్‌ గోయల్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో నడ్డాను నియమించినట్లు సోమవారం అధికార వర్గాలు వెల్లడించాయి.

Published : 25 Jun 2024 05:14 IST

దిల్లీ: రాజ్యసభాపక్ష నేతగా భాజపా అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న పీయూష్‌ గోయల్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో నడ్డాను నియమించినట్లు సోమవారం అధికార వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. నడ్డాతోపాటు మరో 11 మంది రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాజ్యసభాపక్ష నేతగా ఎంపికైన నడ్డాకు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అభినందనలు తెలిపారు. ప్రతిపక్షానికి సభలో ఆయన తగిన ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని